హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ బంద్
- బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్ లు కూడా క్లోజ్
- బోనాల పండుగ సందర్భంగా కమిషనర్ ఆదేశాలు
- ఈ నెల 16, 17 తేదీల్లో మూతపడనున్న మద్యం షాపులు
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను కూడా తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 16 ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 17 సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు మూతపడనున్నాయి.
జంటనగరాల్లో ఏటా ఆషాడ మాసంలో జరిగే బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, మహంకాళి ఆలయం పరిసరాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిఘా పెట్టారు.