ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన

ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన
  • ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఘటన
  • బాధితుడు, నిందితుడు మంచి స్నేహితులు
  • మద్యం తాగిన తర్వాత గొడవ
  • ఇద్దరు నిందితుల అరెస్ట్
మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రవిసర్జన చేసిన ఘటనను మరువకముందే పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సోన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో ఈ నెల 11న జరిగిందీ ఘటన. బాధితుడు, నిందితుడు ఇద్దరూ మంచి స్నేహితులు. మద్యం తాగిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన జవహర్ పటేల్ స్నేహితుడు గులాబ్ కోల్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతడిపై మూత్రవిసర్జన చేసినట్టు ఎస్పీ యస్వీర్ సింగ్ తెలిపారు.  

బాధితుడు మద్యం మత్తులో ఉండడంతో ఏం జరిగిందో గ్రహించలేకపోయాడు. అయితే, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పటేల్‌తోపాటు ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News