కొసావో పార్లమెంటులో కుమ్మేసుకున్న చట్టసభ్యులు.. వీడియో ఇదిగో!

  • ప్రధాని ప్రసంగిస్తుండగా ఆయన ముఖంపై నీళ్లు చల్లిన ప్రతిపక్ష నేత
  • రణరంగాన్ని తలపించిన పార్లమెంటు
  • పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ బీభత్సం
ఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో పార్లమెంటులో చట్ట సభ్యులు కుమ్మేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ నానా రభస సృష్టించారు. ప్రధానమంత్రి అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆయనపై దాడికి ఇదే కారణంగా తెలుస్తోంది.

ప్రధాని కుర్తీ ప్రసంగిస్తుండగా కొసావో డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు మెర్గిమ్ లుష్తకు ఆయన వద్దకు వెళ్లి బాటిల్‌లోని నీళ్లు విసిరారు. దీంతో పార్లమెంటులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అందరూ ముష్టిఘాతాలు కురిపించుకుంటూ కొట్టుకున్నారు. వారికి మహిళా సభ్యులు కూడా తోడయ్యారు. దీంతో పార్లమెంటు మొత్తం రణరంగంగా మారింది. ఆ తర్వాత కొందరు సభ్యులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.


More Telugu News