విండీస్ ను కుప్పకూల్చి... భారీ స్కోరు దిశగా భారత్
- విండ్సర్ పార్క్ మైదానంలో తొలి టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- అశ్విన్ ధాటికి 150 పరుగులకు ఆలౌట్
- టీమిండియాకు శుభారంభం అందించిన ఓపెనర్లు
- 41 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు
- అర్ధసెంచరీలు సాధించిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ
వెస్టిండీస్ తో తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించింది. తొలిరోజు ఆటలో వెస్టిండీస్ ను 150 పరుగులకు కుప్పకూల్చిన భారత్... ఆపై తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం అందుకుంది.
ఓవర్ నైట్ స్కోరు 80/0తో ఇవాళ రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (55 బ్యాటింగ్), కెప్టెన్ రోహిత్ శర్మ (52 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు అజేయంగా 41 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ కేవలం 29 పరుగుల దూరంలో నిలిచింది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఏమాత్రం తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడుతుండడం టీమిండియాకు సానుకూలాంశం.
అంతకుముందు, టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో హడలెత్తించడంతో విండీస్ కథ 150 పరుగులకే ముగిసింది. జడేజాకు 3 వికెట్లు లభించాయి.