శ్రీచైతన్య అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతిపై చంద్రబాబు స్పందన
- ప్రమాదవశాత్తు మరణించిన శ్రీచైతన్య వ్యవస్థాపకుడు బీఎస్ రావు
- బాత్రూంలో జారిపడిన వైనం
- తనను విద్యారంగానికి అంకితం చేసుకున్నారన్న చంద్రబాబు
- సదా చిరస్మరణీయుడని వెల్లడి
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపారు.
డాక్టర్ బీఎస్ రావు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తనను తాను విద్యారంగానికి అంకితం చేసుకున్నారని కొనియాడారు. ఆయన అందించిన ఘనతర వారసత్వం ఇకపైనా కొనసాగుతుందని, ఆయన సదా చిరస్మరణీయుడని కీర్తించారు.
ఈ కష్టకాలంలో డాక్టర్ బీఎస్ రావు కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.