ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత

  • మావోయిస్టు నేత మడకం దేవాను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
  • మడకం దేవా తలపై రూ.5 లక్షల రివార్డు
  • మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చిన ఏపీ డీజీపీ
మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నేత మడకం దేవా అలియాస్ భగత్ ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతని తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. 42 ఏళ్ల దేవా పీఎల్జీఏ దళం ప్లటూన్ కమాండర్ గా ఉన్నాడు. గుత్తికోయ తెగకు చెందిన దేవా చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందినవాడు. 

స్వయంగా లొంగిపోయిన నేపథ్యంలో, లొంగుబాటు-పునరావాసం పథకంలో భాగంగా రూ.5 లక్షల రివార్డుతో పాటు అతనికి అనేక సదుపాయాలు కల్పించనున్నారు. 

దీనిపై ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు-పునరావాసం పథకంలో భాగంగా సదుపాయాలను అందుకుని ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.


More Telugu News