నోయిడా షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం.. మూడో ఫ్లోర్ నుండి కిందకు దూకిన ఇద్దరు
- గ్రేటర్ నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని గెలాక్సీ ప్లాజాలో ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు వెల్లడి
- కిందకు దూకిన వారితో పాటు ఐదుగురికి గాయాలు
గ్రేటర్ నోయిడా ఎక్స్‌టెన్షన్ లోని గెలాక్సీ ప్లాజాలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు సమాచారం రావడంతో బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పోలీసులు, అగ్నిమాపక యూనిట్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని తెలిసిందని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వీడియోలో ఇద్దరు మూడో అంతస్తులోని కిటికీల నుండి కిందకు దూకుతున్నట్లుగా ఉంది. పై నుండి దూకే వారు ప్రమాదం బారినపడకుండా కొందరు స్థానికులు కింద మెత్తటి పరుపులు పెట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ తెలిపారు. స్థానికులు కింద కుషన్స్ పెట్టడంతో పైనుండి దూకిన ఇద్దరికి పెద్దగా గాయాలు కాలేదన్నారు. మరో ముగ్గురు మంటల్లోనే చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు.