చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేసిన ఇస్రో చైర్మన్

  • జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం
  • ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
  • రాకెట్ నమూనాను చెంగాలమ్మ తల్లి ముందు ఉంచిన డాక్టర్ సోమనాథ్
జాబిల్లి రహస్యాలను శోధించే క్రమంలో భారత్ చంద్రయాన్ పరంపరలో మూడో ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కీలక ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికగా నిలుస్తోంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. 

చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముందు ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈసారి చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రోవర్ చంద్రుడిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగుతుందని భావిస్తున్నామని వివరించారు. 

కాగా, చంద్రయాన్-3 రోవర్, ల్యాండర్ లను ఎల్వీఎం-3పీ4 రాకెట్ మోసుకెళ్లనుంది.


More Telugu News