చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం
- తిరుపతి జిల్లా షార్ వేదికగా జరగనున్న చంద్రయాన్-3
- గురువారం ప్రారంభం కానున్న కౌంట్‌డౌన్
- ప్రయోగం ఏర్పాట్లపై శాస్త్రవేత్తలతో ఇస్రో అధిపతి సమీక్ష
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో (షార్) ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. గురువారం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది .
ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో అధిపతి డా. సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. భాస్కరా అతిథి భవనంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్‌వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణ్, వెహికిల్ డైరెక్టర్ బిజూస్ థామస్ పాల్గొన్నారు.