తిరుమలలో మరోసారి చిరుత సంచారం.. కలకలం
- ఘాట్ రోడ్డు 56వ మలుపు వద్ద కనిపించిన చిరుత
- వాహనదారులను గుంపులుగా పంపిస్తున్న అధికారులు
- చిరుతను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్న టీటీడీ
తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద కనిపించింది. అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల అలిపిరి నడక దాడిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటన మరవకముందే ఇప్పుడు చిరుత కనిపించింది. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి.