టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితి అరెస్ట్
- సాహితి కోసం పోల రమేశ్ తో శ్రీనివాస్ ఒప్పందం
- టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 80కి పెరిగిన అరెస్ట్‌ల సంఖ్య
సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పోల రమేశ్ సహకారంతో సాహితి హైటెక్ మాస్ కాపీయింగ్ లో పరీక్షలు రాసినట్లు గుర్తించారు.
కూతురు పరీక్షల కోసం పోల రమేశ్ తో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో శ్రీనివాస్, సాహితిలను అరెస్ట్ చేశారు. రమేశ్ నుండి ఏఈఈ పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేసిన ఆరుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రమేశ్ కు ఆరుగురి నుండి డబ్బులు వచ్చినట్లు ట్రాన్సాక్షన్స్ ద్వారా గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 80 మంది అరెస్టయ్యారు.