కష్టపడ్డా.. స్కిట్లు రాషినా.. అనుష్కతో హీరో గా జేషినా.. సక్సెస్ అయినా: నవీన్ పోలిశెట్టి
- మంత్రి మల్లారెడ్డిని అనుకరించిన యువ హీరో
- జోరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్
- సీఎంఆర్ కాలేజీలో తన స్పీచ్ తో ఆకట్టుకున్న నవీన్
టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యువ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', మహేశ్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన నవీన్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ హిట్ తో అతని స్టార్డమ్ మారిపోయింది. ప్రస్తుతం నవీన్.. అనుష్క శెట్టితో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రచారంలో తనదైన స్టయిల్లో ముందుకెళ్తున్నాడు నవీన్. ఇందులో భాగంగా హైదరాబాద్ మేడ్చల్‌లోని సిఎంఆర్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ మంత్రి మల్లారెడ్డిని అనుకరిస్తూ నవీన్ చేసిన స్పీచ్ విద్యార్థులను అలరించింది.
ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్.. పాలమ్మినా.. పూలమ్మినా.. సక్సెస్ అయినా తరహాలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. ‘ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లచ్చినాయి, నేనేమైన మాయ జేషిననా, మంత్రం జేషిననా, కష్ట పడ్డా.. స్కిట్లు రాషినా, యూట్యూబ్ లో వీడియోలో జేషినా, అనుష్కతో హీరోగా జేషినా... సక్సెస్ అయినా..' మల్లారెడ్డి స్టయిల్లో నవీస్ ఇచ్చిన స్పీచ్ కు అక్కడి విద్యార్థులు కేరింతలు కొట్టారు. కాగా, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కానుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేశ్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.