తమిళంలోని కొన్ని చెడు పదాలు తనకు తెలుసన్న సాక్షి.. ధోనీ రియాక్షన్ ఇదే!
- చెన్నైలో ఓ మూవీ ట్రైలర్ లాంచింగ్ కు హాజరైన ధోనీ, సాక్షి
- సాక్షికి తాను చెడు పదాలను నేర్పించలేదన్న ధోనీ
- తానెప్పుడూ చెడు పదాలను ఉపయోగించనన్న మిస్టర్ కూల్
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ భార్య సాక్షికి కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా చెన్నైలో ఒక సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి ధోనీ, సాక్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షికి తమిళ భాష ఎంత వరకు తెలుసనే విషయంలో యాంకర్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు.
ఈ సందర్భంగా తనకు సెరి (ఓకే), పోడా (వెళ్లు) వంటి పదాలు తెలుసని సాక్షి చెప్పింది. తనకు తమిళంలో కొన్ని చెడు పదాలు కూడా తెలుసని... అయితే వాటి గురించి మాట్లాడనని తెలిపింది. వెంటనే స్టేజ్ మీదకు వచ్చిన ధోనీ మాట్లాడుతూ... తమిళంలోని చెడు పదాలను తాను సాక్షికి నేర్పించలేదని చెప్పాడు. ఎందుకంటే తాను స్వయంగా ఎప్పుడూ చెడు పదాలను ఉపయోగించనని నవ్వుతూ అన్నాడు. ధోనీ రిప్లైతో అక్కడ నవ్వులు విరబూశాయి.