అనిల్ అంబానీ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ ఆసక్తి!
- బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అనిల్ కు చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్
- రుణాలు చెల్లించని కారణంగా పవర్ ప్లాంట్ వేలానికి బ్యాంకుల సిద్ధం
- బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో పరిధి విస్తరించేందుకు అదానీకి అవకాశం
అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. మధ్య భారతంలో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని తెలిపింది. అయితే తీవ్ర పోటీ నెలకొనవచ్చునని పేర్కొంది.
ప్రస్తుతం విదర్భ ఇండస్ట్రీస్ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. పవర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంది. వీటిని చెల్లించని కారణంగా బ్యాంకులు పవర్ ప్లాంటును వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి. అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఈ ప్లాంట్ ను తిరిగి దక్కించుకునేందుకు అనిల్ అంబానీ కూడా వేలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.