భారత్ లోని యాప్ స్టోర్ నుంచి 6 యాప్ లను నిషేధించిన ఆపిల్
- అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న లోన్ యాప్ లు
- వినియోగదారుల నుంచి ఆపిల్ కు ఫిర్యాదులు
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 6 యాప్ లపై చర్యలు
వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో 6 యాప్ లపై ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ నిషేధం విధించింది. ఈ ఆరు క్విక్ లోన్ యాప్ లే. వీటిని భారత్ లోని యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు ఆపిల్ పేర్కొంది. ఈ యాప్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆపిల్ గుర్తించింది.
ప్రముఖ ఆర్థిక సంస్థల్లా వినియోగదారులను నమ్మిస్తూ, అధిక మొత్తంలో రుసుం వసూలు చేయడం, ఎక్కడా లేనంత ఎక్కువగా వడ్డీలు, ప్రాసెసింగ్ ఫీజు పేరిట అధిక మొత్తాలు గుంజుకోవడం, రుణం తీసుకున్న కస్టమర్లను బెదిరింపులకు గురిచేయడం వంటి అక్రమ విధానాలను ఈ లోన్ యాప్ లు అనుసరిస్తున్నట్టు ఆపిల్ పేర్కొంది.
ఈ యాప్ లు యూజర్ల కాంటాక్ట్ లిస్టును, మీడియా ఫైల్స్ ను తెరిచేందుకు డిమాండ్ చేస్తుండడం, అందుకు సరైన కారణాలు చెప్పకపోవడం వంటి చర్యలపై వినియోగదారులు ఆపిల్ కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వైట్ క్యాష్, పాకెట్ క్యాష్, గోల్డెన్ క్యాష్, ఓకే రూపీ తదితర యాప్ ల కార్యకలాపాలను పరిశీలించిన ఆపిల్... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించి వేటు వేసింది.