చెట్ల కింద చదువులు చూడాలంటే మారుమూల గ్రామాలకే వెళ్లనక్కర్లేదు... ఏలూరులోనే చూడొచ్చు: పవన్ కల్యాణ్
- కొనసాగుతున్న పవన్ వారాహి యాత్ర రెండో దశ
- ఏలూరులో నేడు జనవాణి కార్యక్రమం
- ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్న జనసేనాని
- ఏలూరు గవర్నమెంట్ కాలేజీ పరిస్థితిపై ట్వీట్
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర-2 కొనసాగుతోంది. ఏలూరులో పవన్ కల్యాణ్ ఇవాళ జనవాణి కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
కాగా, పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. చెట్ల కింద కొందరు విద్యార్థులు చదువుకుంటున్న ఫొటోలను పంచుకున్నారు. "చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లనక్కర్లేదు. ఇక్కడ ఏలూరులోనే చూడొచ్చు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కాలేజీకి వెళితే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ కళాశాలకు భవనం నిర్మించడంపై కూడా చూపించాలి. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్" అంటూ పవన్ పేర్కొన్నారు.
ఈ కాలేజీలో విద్యార్థుల పరిస్థితిపై వినతిపత్రం అందిన నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.