'హీల్ ఏ చైల్డ్' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు, నమ్రత... ఫొటోలు ఇవిగో!

'హీల్ ఏ చైల్డ్' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు, నమ్రత... ఫొటోలు ఇవిగో!
  • పేద బాలలకు వైద్య సేవలు అందిస్తున్న హీల్ ఏ చైల్డ్ ఎన్జీవో
  • హీల్ ఏ చైల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేశ్ బాబు
  • గేమ్ చేంజర్-2023 పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మహేశ్ బాబు ఫొటోలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో సమయం కేటాయిస్తుంటారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందల సంఖ్యలో చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయిస్తూ మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

మహేశ్ బాబు హీల్ ఏ చైల్డ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం వెల్లడైంది. పేదరికంలో ఉన్న చిన్నారులకు ఈ హీల్ ఏ చైల్డ్ సంస్థ వైద్య సేవలు అందిస్తుంటుంది. 

కాగా, హీల్ ఏ చైల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గేమ్ చేంజర్-2023 పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు తన సామాజిక దృక్పథాన్ని చాటుతూ ప్రసంగించారు. హీల్ ఏ చైల్డ్ ఎన్జీవో సేవలను కొనియాడారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.


More Telugu News