'రంగబలి' మూవీ మండే టాక్!

  • ఈ నెల 7వ తేదీన విడుదలైన 'రంగబలి'
  • నాగశౌర్య జోడీ కట్టిన యుక్తి తరేజా 
  • ఆశించిన స్థాయిలో లభించని ఆదరణ 
  • కంటెంట్ ను కరెక్టుగా ప్రమోట్ చేయలేకపోయారని టాక్
క్రితం శుక్రవారం .. అంటే ఈ నెల 7వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమాలలో 'రంగబలి' ఒకటి. నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా నటించిన ఈ సినిమాకి, పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. ప్రమోషన్స్ వైపు నుంచి కొంత సందడి చేసినా ఆశించిన స్థాయి బజ్ రాలేదు. కానీ థియేటర్స్ నుంచి బయటికి వచ్చినవారెవరూ సినిమా గురించి నెగెటివ్ గా చెప్పలేదు. 

ఈ కథలో లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్స్ ను దర్శకుడు కుదురుగానే సర్దాడు. ఫస్టాఫ్ లో హీరో .. ఆ ఊరితో అతనికి ఉన్న అనుబంధం .. ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ .. ఫ్రెండ్స్ బ్యాచ్ .. లవ్ లో పడటం చూపించారు. సెకండాఫ్ లో .. హీరోయిన్ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి హీరో రంగంలో దిగడం .. అందుకోసం విలన్ తో తలపడటం .. ఇలా అన్ని వైపుల నుంచి కథను బ్యాలెన్స్ చేయడం కనిపిస్తుంది. 'రంగబలి' సెంటర్లో హీరోకి .. విలన్ కి మధ్య జరిగే సంభాషణ ఈ సినిమాకి హైలైట్. 

కంటెంట్ పరంగా ఈ సినిమా చాలావరకూ కనెక్ట్ అవుతుంది. పైగా ఆ వారం థియేటర్లకు వచ్చిన వాటిలో ఇదే కాస్త పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ మాత్రం కంటెంట్ ఉంటే చాలు ఈ మధ్య వచ్చే సినిమాలు హిట్టైపోతున్నాయి. అలాంటిది ఈ సినిమాకి మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఆ తరువాత అనుకున్న స్థాయిలో పుంజుకోనూ లేదు. కొన్ని సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చినప్పటికీ, ఎక్కడో ఏదో తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఈ సినిమా వరకూ మాత్రం, రిలీజ్ కి ముందు కంటెంట్ ను కరెక్టుగా ప్రమోట్ చేయలేకపోయారనేది ప్రేక్షకుల నోట వినిపిస్తున్న మాట. 



More Telugu News