వార్తలు చదివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మ.. వీడియో ఇదిగో!
- ఒడియాలో గడగడా వార్తలు చదివిన తొలి ఏఐ న్యూస్ యాంకర్
- ఇంగ్లిష్ లో వార్తలు చదివేలా ప్రోగ్రామ్ చేసిన ఓ టీవీ
- భవిష్యత్తులో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని వెల్లడి
భారతీయ సంప్రదాయ చీరకట్టుతో తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారుచేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. లేడీ యాంకర్ ను తలపించేలా గడగడా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను అబ్బురపరిచింది. ఒడిశాలో పేరొందిన న్యూస్ ఛానల్ ఓ టీవీ ఈ కొత్త యాంకర్ ను ఆదివారం తన వీక్షకులకు పరిచయం చేసింది. ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ ‘లిసా’తో వార్తలు చెప్పించింది.
ఒడియాతో పాటు ఇంగ్లిష్ లోనూ వార్తలు చదివేలా లీసా ను ప్రోగ్రామ్ చేసినట్లు ఓ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జాగి మంగత్ పాండా పేర్కొన్నారు. రాష్ట్రానికి మొట్టమొదటి ఏఐ యాంకర్ ను పరిచయం చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆమె వివరించారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుందని పాండా పేర్కొన్నారు.