సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

  • ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కోరిన కవిత
  • ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని పిటిషన్
  • జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా విచారణ వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు. 

అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. కోర్టు నంబర్ 2, 8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.


More Telugu News