119 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి చేరుకున్న పుస్తకం
- అమెరికాలోని మసాచుసెట్స్ లైబ్రరీలో విచిత్రం
- 1904 లో ఓ మెంబర్ తీసుకెళ్లిన అరుదైన పుస్తకం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లైబ్రరీ పోస్టు
అమెరికాలోని మసాచుసెట్స్ లో విచిత్రం చోటుచేసుకుంది. దాదాపు 119 ఏళ్ల క్రితం పబ్లిక్ లైబ్రరీ నుంచి ఓ మెంబర్ తీసుకెళ్లిన అరుదైన పుస్తకం తాజాగా రిటర్న్ వచ్చింది. లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన గడువు ముగిసిన పుస్తకాన్ని తిరిగివ్వడంలో ఆలస్యమనేదే ఉండదనే క్యాప్షన్ తో సదరు పుస్తకం ఫొటోను మసాచుసెట్స్ లైబ్రరీ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మసాచుసెట్స్ పబ్లిక్ లైబ్రరీ పోస్ట్ ప్రకారం.. విద్యుత్ రంగంలో అభివృద్ధిపై జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ రాసిన పుస్తకాన్ని 1904లో ఓ మెంబర్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత దానిని తిరిగివ్వడం మర్చిపోయాడు. అప్పటి నుంచి పుస్తకం పలువురి చేతులు మారి వెస్ట్ వర్జీనియాలోని ఓ ఛారీటి సంస్థ నిర్వహించే బుక్ స్టాల్ లోకి చేరింది. ఉచితంగా పుస్తకాలను అందించే స్టాల్ లో ఈ పుస్తకంలో మసాచుసెట్స్ లైబ్రరీ స్టాంప్ ను చూసిన రీడర్ ఒకరు దానిని పోస్ట్ ద్వారా పంపించాడు. దీంతో 119 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి సొంతింటికి చేరుకుంది.