టాలీవుడ్ కు ఆ కాన్సెప్ట్ పరిచయం చేసింది నేనే: రేణూ దేశాయ్
- ఖుషీ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసినట్టు వెల్లడి
- లండన్ లో పలు కలర్ కాంబినేషన్లో పవన్ కు దుస్తులు సెలెక్ట్ చేశానన్న రేణూ
- ఆ తర్వాత పవన్ చిత్రాలకు స్టైలిస్ట్ గా పనిచేశానని వివరణ
ప్రముఖ నటి, మరాఠీ దర్శకురాలు రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తెలుగు చిత్రాల్లో గతంలో కాస్ట్యూమ్ డిజైనర్ ఉండేవారని, ఆ తర్వాత స్టైలిస్ట్ రంగప్రవేశం చేశారని వివరించారు. టాలీవుడ్ కు స్టైలిస్ట్ కాన్సెప్ట్ ను అందించింది తానే అని స్పష్టం చేశారు.
ఖుషీ సినిమాకు తాను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశానని, ఓసారి లండన్ వెళ్లినప్పుడు పవన్ కల్యాణ్ కు కొన్ని కలర్ కాంబినేషన్లలో డ్రెస్సులు సెలెక్ట్ చేశానని, వాటిని ఆయన బాగా ఇష్టపడ్డారని రేణూ దేశాయ్ తెలిపారు. ఆ విధంగా ఖుషీ చిత్రంతో స్టైలిస్ట్ కాన్సెప్ట్ ను పరిచయం చేశానని వివరించారు. అక్కడ్నించి బాలు, గుడుంబా శంకర్, బంగారం, జల్సా సినిమాలకు కూడా స్టైలిస్ట్ గా చేశానని తెలిపారు. అయితే, స్టైలింగ్ కు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కు తేడా ఉందని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.