నువ్వు క్రిమినల్ వి జగన్... నువ్వు పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోంది: పవన్ కల్యాణ్

  • ఏలూరులో పవన్ కల్యాణ్ సభ
  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగేలా ప్రసంగం
  • ప్రభుత్వం మారాక నీ తప్పులన్నీ బయటికి తీస్తాం అంటూ పవన్ వార్నింగ్
  • ఊరూరా తిప్పి సమాధానం చెప్పేలా చేస్తామని స్పష్టీకరణ
ఏలూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. నువ్వు క్రిమినల్ వి జగన్... మా దురదృష్టం కొద్దీ మాకు ముఖ్యమంత్రివి అయ్యావు... ఎస్సైని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మారడమే ఆలస్యం... ప్రతి తప్పు బయటకు తీస్తాం.... నిన్ను ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పేలా చేస్తాం అని పవన్ స్పష్టం చేశారు. 

"మాట్లాడితే చాలు... ఈ జగన్ నేను హైదరాబాదులో ఉన్నానని అంటాడు. జగన్... నేను మీ నాన్నగారిలా ప్రాజెక్టుల మీద 6 శాతం కమీషన్ దోచుకోలేదు. సీఎం పదవి చాటున వేల కోట్లు దోచుకోలేదు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను జగన్. సినిమాల్లో సంపాదించిన డబ్బును కౌలు రైతులు ఖర్చు పెడుతున్నాను" అని స్పష్టం చేశారు. 

అసలు, ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. "ప్రశ్నిస్తారనే ప్రెస్ మీట్లు పెట్టడంలేదు. ఓ రాణిలా పరదాల చాటున దాక్కుని వెళతాడు. ముఖం చూపించకుండా ఉండడానికి నువ్వేమైనా రాణివా? అలాంటప్పుడు ఇక్కడెందుకు... వెళ్లి ఇడుపులపాయలో కూర్చో. ఏ గ్రామానికి వెళ్లవు, అలాంటప్పుడు నువ్వు తాడేపల్లిలో ఉంటే ఏంటి, దాచేపల్లిలో ఉంటే ఏంటి?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News