ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం

  • దేశ రాజధానిలో రెండ్రోజులుగా భారీ వర్షాలు
  • సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిమీ వర్షపాతం నమోదు
  • 1982 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం
నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీని ఇవాళ కూడా కుంభవృష్టి అతలాకుతలం చేసింది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిమీ వర్షపాతం నమోదైంది. 41 ఏళ్ల తర్వాత హస్తినలో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే ప్రథమం. 

గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. నిన్న ఒక్కరోజే 126 మిమీ వర్షం కురిసింది. ఈ నైరుతి సీజన్ లో కురవాల్సిన మొత్తం వర్షపాతంలో 15 శాతం కేవలం 12 గంటల్లోనే కురిసింది. 

నగరంలో ఎక్కడ చూసినా జలమయం అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనే వాహనాలు ప్రయాణిస్తున్నాయి.


More Telugu News