ప్రయాణికులకు గమనిక.. ఆ రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు
- గత నెల 19న పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
- సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ
- పొడిగింపుపై అన్ని స్టేషన్లకు సమాచారం
వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.
రద్దయిన రైళ్లు ఇవే..
* కాజీపేట-డోర్నకల్ (07753)
* డోర్నకల్-కాజీపేట మెము (07754)
* డోర్నకల్-విజయవాడ (07755)
* విజయవాడ-డోర్నకల్ (07756)
* భద్రాచలం రోడ్-విజయవాడ (07278)
* విజయవాడ-భద్రాచలం రోడ్ (07979)
* సికింద్రాబాద్-వరంగల్ (07462)
* వరంగల్-హైదరాబాద్ మెము (07463)
* కాజీపేట-సిర్పూరు టౌన్ (17003)
* బల్లార్షా-కాజీపేట రాంగిరి మెము (17004)
* భద్రాచలం రోడ్-బల్లార్షా (17033),
* సిర్పూరు టౌన్-భద్రాచలం రోడ్ (17034)
రద్దయిన రైళ్లు ఇవే..
* కాజీపేట-డోర్నకల్ (07753)
* డోర్నకల్-కాజీపేట మెము (07754)
* డోర్నకల్-విజయవాడ (07755)
* విజయవాడ-డోర్నకల్ (07756)
* భద్రాచలం రోడ్-విజయవాడ (07278)
* విజయవాడ-భద్రాచలం రోడ్ (07979)
* సికింద్రాబాద్-వరంగల్ (07462)
* వరంగల్-హైదరాబాద్ మెము (07463)
* కాజీపేట-సిర్పూరు టౌన్ (17003)
* బల్లార్షా-కాజీపేట రాంగిరి మెము (17004)
* భద్రాచలం రోడ్-బల్లార్షా (17033),
* సిర్పూరు టౌన్-భద్రాచలం రోడ్ (17034)