తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
- పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రం పైకి గాలులు
- నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
- అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.3 సెంటీమీటర్ల వాన
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. నిన్న కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా లక్ష్మీనగర్, ములుగు జిల్లా మల్లంపల్లిలో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.