ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఈనెల 11న సుప్రీం కోర్టు విచారణ

  • అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను అదేరోజు విచారించనున్న న్యాయస్థానం
  • రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, తదితరుల పిటిషన్లపై విచారణ
  • జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ కన్నా ముందుకు పిటిషన్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై ఈ నెల సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 11న విచారించనున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది. గతంలో జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కానీ ఆయన పదవీ విరమణ నేపథ్యంలో అమరావతి రాజధాని కేసులు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చాయి.


More Telugu News