యాషెస్ సిరీస్: స్టేడియం లోపలకు వెళ్లకుండా మెకల్లమ్‌ను గేటు వద్ద అడ్డుకున్న సెక్యూరిటీ
- ఎంట్రీ పాస్ కోల్పోవడంతో అతనిని గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది
- మెకల్లమ్‌తో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం
- ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీపై మెకల్లమ్ ఆగ్రహం
ఇంగ్లండ్ చీఫ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎంట్రీ పాస్ కోల్పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అతనిని గుర్తించలేదు. దీంతో అతనిని గేటు వద్ద అడ్డుకున్నారు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు హెడ్డింగ్లీ స్టేడియం ప్రవేశద్వారం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఎంట్రీ పాస్ లేదని మెకల్లమ్ ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఇంగ్లండ్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. మెకల్లమ్ వద్ద ఎంట్రీ పాస్ లేకపోవడంతో అతనిని భద్రతా సిబ్బంది గుర్తించలేక, గేటు వద్దనే ఆపివేసింది. అంతేకాదు, మెకల్లమ్ తో వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. దీంతో సహనం కోల్పోయిన మెకల్లమ్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించాడు.