కాస్త ఆలస్యంగా తండ్రికి నివాళులు అర్పించిన సీఎం జగన్... తనయుడ్ని ఆప్యాయంగా ముద్దాడిన విజయమ్మ
- నేడు వైఎస్సార్ జయంతి
- అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్
- పర్యటన అనంతరం ఈ సాయంత్రం ఇడుపులపాయ రాక
- సీఎం జగన్ వెంట విజయమ్మ
నేడు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. సీఎం జగన్ కాస్త ఆలస్యంగా తండ్రికి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లాలో పర్యటన అనంతరం సీఎం జగన్ ఈ సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్నారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం తండ్రిని స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట ఆయన తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. జగన్ వైఎస్ సమాధి వద్దకు రాగానే విజయమ్మ తనయుడ్ని ఆప్యాయంగా ముద్దాడారు. ఈ ఉదయం విజయమ్మ కుమార్తె షర్మిలతో పాటు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం తెలిసిందే.