వైసీపీ సోషల్ మీడియా, ఛానల్స్‌పై పోలీసులకు జనసేన ఫిర్యాదు
- వారాహి యాత్ర విజయవంతం కావడంతో అనుచిత వ్యాఖ్యలు అంటూ ఆగ్రహం
- తిరుపతి, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదు చేసిన వీరమహిళలు
- అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావడం, జనసేనకు ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి వైసీపీ సోషల్ మీడియా, ఛానళ్లు పార్టీ అధినేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ జనసేన రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసింది.
పెద్దాపురం నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ రామస్వామి బాబు ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకులు చేస్తోన్న అభ్యంతరకర వ్యాఖ్యలపై పెద్దాపురం పట్టణ పోలీస్ స్టేషన్, సామర్లకోట పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు వచ్చిన సోషల్ మీడియా అకౌంట్ల వివరాలతో సహా పోలీసులకు అందించారు.
తిరుపతి జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు... జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, వారి అకౌంట్లను బ్లాక్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ జనసేన నాయకులు, వీరమహిళలు పోలీస్ కమిషనరేట్ లో డీసీపీకి ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం, పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జనసేన ఫిర్యాదులు చేసింది.
పవన్ కల్యాణ్ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్న, అసత్య ప్రచారాలతో, సమాజంలో గొడవలు పెట్టేలా రెచ్చిపోతున్న వైసీపీ సోషల్ మీడియా... తన పెయిడ్ ఆర్టిస్ట్‌లతో నీచ సంస్కృతికి తెరలేపుతోందని, వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది.