ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటున్నారు: సజ్జల
- 2014 నాటి హామీలనే చంద్రబాబు మళ్లీ ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
- ప్రజలను మోసం చేయడమేనని స్పష్టీకరణ
- ప్రజలకు అన్నీ గుర్తుంటాయని వెల్లడి
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటున్నారని విమర్శించారు. 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇప్పుడా హామీలనే మళ్లీ ప్రచారం చేయడం అంటే ప్రజలను దారుణంగా మోసగించడమేనని సజ్జల పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
కాగా, బీజేపీ వాళ్లు పిలవకపోయినా, పిలిచినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గతంలో మోదీని ఇష్టం వచ్చినట్టు తిట్టారని వెల్లడించారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించుకురాలేదని, కానీ జగన్ ఎవరి భాగస్వామ్యం లేకుండానే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తున్నారని సజ్జల కొనియాడారు.