వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర – 2’ పోస్టర్!

వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర – 2’ పోస్టర్!
  • యానిమేషన్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
  • ఎన్నికల సమయంలో వైఎస్ మాటలతో వీడియో 
  • జగన్‌ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా?.. త్వరలో ప్రకటన!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర-2’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ పెద్ద చెయ్యి, చుట్టూ జనం.. అరచేతి పైకి జగన్ వెళ్తున్నట్టుగా యానిమేషన్ వీడియోను రూపొందించారు. 

ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ చెప్పిన మాటలతో మోషన్‌ పోస్టర్‌ వీడియో ప్రారంభమైంది. ‘‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే.. నమస్తే..” అంటూ వైఎస్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.

‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’’ అనే డైలాగ్‌ని జగన్ పాత్రధారి చెప్పారు. ‘యాత్ర’ మొదటి భాగంలో వినిపించిన ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో వీడియో ముగుస్తుంది. 

వైసీపీ ఆవిర్భావం, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం కావడం వంటి అంశాలను యాత్ర 2 లో చూపించనున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. జగన్‌ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది.




More Telugu News