ప్రధాన మంత్రి ఆదేశంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్
- రెండు రోజుల క్రితం ఆటకు గుడ్ బై చెప్పిన తమీమ్ ఇక్బాల్
- తన ఇంటికి ఆహ్వానించి నచ్చజెప్పిన ప్రధాని షేక్ హసీనా
- ప్రధాని ఆదేశంతో రిటైర్మెంట్ ను వెనక్కితీసుకున్నట్టు తెలిపిన తమీమ్
బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. కానీ, ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కితీసుకొని అంతే ఆశ్చర్యపరిచాడు. ఇలా అతను 24 గంటల్లోనే యూటర్న్ తీసుకోవడానికి కారణంగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కావడం విశేషం. రిటైర్మెంట్ ప్రకటన వచ్చిన వెంటనే తమీమ్‌ను కుటుంబ సమేతంగా హసీనా తన ఇంటికి ఆహ్వానించారు. ఆసియా కప్, ప్రపంచ కప్ ముగిసేంత వరకు ఇంకొన్నాళ్లు ఆడాలని సూచించడంతో తమీమ్ కాదలేకపోయాడు.
నిన్న ఆమెతో భేటీ అయిన తర్వాత తమీమ్ రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. నెలన్నరపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి ఆడతానని తెలిపాడు. స్వయంగా ప్రధానమంత్రి తనను వారి ఇంటికి ఆహ్వానించారని, సుదీర్ఘమైన చర్చ తర్వాత తిరిగి క్రికెట్ ఆడాలని ఆదేశించారని చెప్పాడు. దాంతో, కాదనలేకపోయానని తెలిపాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా, బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ కూడా ఒత్తిడి చేయడంతో తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.