నయనతార - విఘ్నేశ్ శివన్ దంపతులపై మరో కేసు

  • ఆస్తి వివాదంలో పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు
  • విఘ్నేశ్ శివన్ తండ్రి తమకు తెలియకుండా ఉమ్మడి ఆస్తి అమ్మేశారని ఫిర్యాదు
  • ఆస్తి కొనుక్కున్న వ్యక్తికి తగు డబ్బులు చెల్లించి వెనక్కు తెప్పించాలని డిమాండ్
  • నయనతార, విఘ్నేశ్ శివన్, ఆయన తల్లిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 
స్టార్ కపుల్ నయన తార - విఘ్నేశ్ శివన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు నయనతార పేరును కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు స్వస్థలం తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామం. ఆయనకు ఎనిమిది మంది అన్నదమ్ముులు ఉన్నారు. శివ కొళుదు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేసేవారట. అయితే, కొన్నేళ్ల క్రితం ఆయన అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిలో కొంత భాగాన్ని తానే అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ తరువాత ఆయన పోయారు.    

శివ కొళుదు అమ్ముకున్న ఆస్తి విషయమై తాజాగా ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు. తమకు తెలియకుండా శివ అమ్ముకున్న ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తిరిగి తెచ్చుకునేందుకు సాయపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విఘ్నేశ్ శివన్, ఆయన భార్య నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు.


More Telugu News