పొలంలో నాట్లు వేసిన రాహుల్ గాంధీ.. ఫొటోలు ఇవిగో

  • హర్యానాలోని సోనిపట్ లో రైతులతో మాటామంతీ 
  • హిమాచల్ ప్రదేశ్ వెళుతూ మధ్యలో ఆగిన కాంగ్రెస్ మాజీ చీఫ్
  • గతంలో రాత్రంతా ట్రక్కులో ప్రయాణించిన రాహుల్
సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి రైతులను కలుసుకున్నారు. పొలంలో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ.. హర్యానాలోని సోనిపట్ లోని ఓ పొలం వద్ద కారు ఆపి దిగారు. పక్కనే పొలంలో నాట్లు వేస్తున్న రైతులను పలకరించారు. ఆపై వారితో కలిసి కాసేపు నాట్లు వేశారు. ట్రాక్టర్ ఎక్కి కాసేపు పొలం దున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు రాహుల్ ఇలా వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలుస్తున్నారు.

ఇటీవల బైక్ మెకానిక్ గా కరోల్ బాగ్ ఏరియాలోని ఓ మెకానిక్ షాపులో స్క్రూడైవర్, పానా చేతబట్టిన రాహుల్ గాంధీ.. అంతకుముందు లారీ డ్రైవర్లతో కలిసి రాత్రంతా ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో ఉంటున్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను కలుసుకోవడానికి వెళుతూ మధ్యలో ఇలా రైతులను కలుసుకున్నారు. రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీ నుంచి సిమ్లా వరకు రాత్రంతా ట్రక్కులో ప్రయాణించారు.
  


More Telugu News