మినీ స్కర్ట్, చినిగిన జీన్స్‌కు నో.. రాజస్థాన్ ఆలయంలో డ్రెస్ ‌కోడ్

  • ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయంలో నిబంధనలు
  • స్త్రీ,పురుషులు హుందాగా ఉండే దుస్తులు ధరించి రావాలని విజ్ఞప్తి
  • లేదంటే బయటి నుంచే దండం పెట్టుకుని వెళ్లాలంటూ బ్యానర్లు
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో కొలువైన ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయం భక్తులకు డ్రెస్ కోడ్ విధించింది. షార్ట్‌లు, మినీ స్కర్టులు, ఫ్రాకులు, రిప్ప్‌డ్ జీన్స్, నైట్ సూట్స్‌తో ఆలయంలోకి రావడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయం బయట బ్యానర్లు ఏర్పాటు చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని, లేని వారు బయటి నుంచే దండం పెట్టుకుని వెళ్లాలని అందులో పేర్కొన్నారు.

చిరిగిన జీన్స్‌, స్కర్ట్స్ ధరించి భక్తులు ఆలయానికి వస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధ్యక్షుడు జయప్రకాశ్ సోమాని తెలిపారు. ఇలాంటి దుస్తులు ధరించి రావడం భారత సంప్రదాయానికి విరుద్ధమని అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చే స్త్రీపురుషులు హుందాగా ఉండే దుస్తులు ధరించి రావాలని కోరారు. ఉదయ్‌పూర్‌లోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన జగదీశ్ ఆలయం కూడా ఇలాంటి నిబంధనలే విధించింది.


More Telugu News