నెదర్‌లాండ్స్‌లో కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం

  • వలసల విధానంపై అధికార కూటమిలో కుదరని ఏకాభిప్రాయం
  • ఏకాభిప్రాయం కోసం పార్టీల విఫలయత్నం
  • తన రాజీనామా లేఖను రాజుకు అందజేసిన మార్క్
  • తమ మధ్య అభిప్రాయ భేదాలు అధిగమించలేని స్థాయిలో ఉన్నాయని ప్రకటన
నెదర్‌లాండ్స్‌లో ప్రధాని మార్క్ రట్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై సంకీర్ణ కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని తప్పుకున్నారు. తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వలసల విధానంపై ఏకాభిప్రాయం కోసం కొన్ని రోజులుగా పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 

‘‘మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మరికాసేపట్లో నేను రాజీనామా చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను శనివారం నెదర్‌లాండ్స్‌ రాజు విల్లెమ్-అలెక్సాండర్‌కు అందజేశారు. అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణం ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం. 

విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం గతేడాది వెలుగులోకి రావడం లాండ్స్‌లో సంచలనానికి దారి తీసింది. దీంతో, వలసల కట్టడికి వీవీడీ పార్టీ నేత మార్క్ రట్ ప్రయత్నించారు. విదేశీ శరణార్థుల కుటుంబసభ్యులను దేశంలోకి అనుమతించడంపై పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.


More Telugu News