వరల్డ్ హాటెస్ట్ డే: ఒకేవారంలో మూడుసార్లు అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు బ్రేక్

  • సోమ, మంగళ వారాల రికార్డును దాటేసి గురువారం అత్యధిక ఉష్ణోగ్రత
  • జులై 6న ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.23 డిగ్రీల సెల్సియస్
  • మున్ముందు మరింత అత్యధిక ఉష్ణోగ్రతలు 
వరల్డ్ హాటెస్ట్ డేగా... ఒకే వారంలో మూడుసార్లు రికార్డులు బ్రేక్ అయ్యాయి. యూఎస్ నేషనల్ సెంటర్స్ ఆన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగుతున్నాయి. వరల్డ్ హాటెస్ట్ డేగా గత రికార్డును సోమవారం, ఆ తర్వాత మంగళవారం తిరగరాశాయి. ఆ గరిష్ఠాలను గురువారం బద్దలు కొట్టి, వరల్డ్ హాటెస్ట్ డేను నమోదు చేసింది. ప్రభుత్వ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత గురువారం 17.23 డిగ్రీల సెల్సియస్ (63.01 ఫారెన్ హీట్)కు చేరుకుంది.

కొన్నిరోజులుగా అమెరికా, చైనాలో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా మెక్సికోలో 100 మందికి పైగా మరణించారు. జూన్ ఎప్పుడూ అత్యంత వేడి కలిగిన నెల అని యూరోపియన్ యూనియన్ కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ వెల్లడించింది.

2019 జూన్ లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డును ఈ జూన్ దాటేసింది. ఇటీవల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నందున ఈ ఏడాది మరిన్ని గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డులు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. మున్ముందు మరిన్ని అత్యధిక ఉష్ణోగ్రత రోజులను చూస్తామని బంగ్లాదేశ్ కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సలీముల్ హుక్ ఓ ప్రకటనలో తెలిపారు.


More Telugu News