ఒడిశా రైలు ప్రమాదం: ముగ్గురు రైల్వే సిబ్బంది అరెస్ట్

  • రైల్వే శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
  • సాక్ష్యాలను నాశనం చేయడం సహా పలు అభియోగాలు
  • అరెస్టైన వారిలో సెక్షన్ ఇంజినీర్లు, టెక్నిషియన్లు
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెలలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కేసులో కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ రైల్వే శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేసింది. ఈ ప్రమాద ఘటన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో నేరపూరిత కుట్ర దాగి ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టింది. అయితే తాజాగా అరెస్టైన ముగ్గురిపై సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలను మోపింది. అరెస్టైన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్ లను అరెస్ట్ చేశారు.

వారిపై నేరపూరిత హత్య, సాక్ష్యాలను నాశనం చేసినట్టు అభియోగాలు మోపారు. ఈ ముగ్గురి చర్యలు ప్రమాదానికి దారితీశాయని విచారణలో వెల్లడైంది. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో 293 మందికి పైగా మరణించగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు.


More Telugu News