'నాయకుడు' చిత్రంపై అంచనాలు పెంచేస్తున్న మహేశ్ బాబు కామెంట్
- ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తిసురేశ్ నటించిన చిత్రం నాయకుడు
- తమిళంలో మామన్నన్... తెలుగులో నాయకుడుగా వస్తున్న చిత్రం
- ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫజిల్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నాయకుడు. తమిళంలో మామన్నన్ గా తెరకెక్కిన ఈ పొలిటికల్ థిల్లర్ మూవీ తెలుగులో నాయకుడు పేరుతో వస్తోంది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. నాయకుడు సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకుడ్ని సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లర్ లా అనిపిస్తోందని మహేశ్ బాబు అభిప్రాయపడ్డారు. ఎంతో నైపుణ్యం ఉన్న చిత్రబృందం ఈ సినిమా కోసం పనిచేసిందని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వెల్లడించారు. నాయకుడు సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపారు.
రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అదనపు ఆకర్షణ కానుంది.