చేనేత వ్యాపారిని గుడ్డలూడదీసి కొట్టడం జగన్ అరాచక పాలనకు నిదర్శనం: పంచుమర్తి అనురాధ
- ధర్మవరం చేనేత వ్యాపారిపై అవినాశ్ గుప్తా దాడి
- జగన్ అండ చూసుకుని రౌడీలు పేట్రేగిపోతున్నారన్న అనురాధ
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చేనేత వర్గం బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్య
ధర్మవరం చేనేత వ్యాపారిపై విజయవాడలోని ఓ షోరూం యజమాని అయిన అవినాశ్ దాడి చేసిన ఘటన తెలిసిందే. అవినాశ్ వైసీపీ నేత అని... జగన్ అండ చూసుకునే అవినాశ్ గుప్తా వంటి రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. సరఫరా చేసిన సరుక్కి డబ్బులు అడగడమే ధర్మవరం వ్యాపారులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. బాకీ తీర్చమన్న వ్యాపారిని గుడ్డలు ఊడదీసి కొట్టడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు.
బడుగు, బలహీన వర్గాలు అంటే మీకెందుకంత చులకన అని ప్రశ్నించారు. సబ్సిడీ లోన్స్, రుణమాఫీ వంటి కార్యక్రమాలతో చేనేత కార్మికులను చంద్రబాబు ఆదుకుంటే... జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. అవినాశ్ గుప్తాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చేనేత వర్గం బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.