ఈ రాష్ట్రంలో కేజీ టమాటా రూ. 250
- ఉత్తరాఖండ్ లో మండిపోతున్న టమాటా ధర
- గంగోత్రి ధామ్ లో కేజీ టమాటా రూ. 250
- హైదరాబాద్ లో రూ. 100 నుంచి 130 మధ్య ఉన్న ధర
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ధర మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ లో కేజీ టామాటా రూ. 250గా ఉంది. ఉత్తరకాశీ జిల్లాలో కేజీ ధర రూ. 180 నుంచి 200 వరకు ఉంది. ఈ సందర్భంగా ఓ వ్యాపారి స్పందిస్తూ... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా టమాటా ధరలు పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ధరలతో టామాటా కొనడానికి ప్రజలు పెద్దగా ఇష్టపడటం లేదని అన్నారు.
టమాటా పండే ప్రాంతాల్లో హీట్ వేవ్ కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉందని పలువురు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రవాణాకు ఆటంకాలు ఏర్పడటం కూడా మరో కారణమని అంటున్నారు. మరోవైపు బెంగళూరులో కేజీ టమాటా రూ. 100 నుంచి 120 మధ్యలో ఉంది. హైదరాబాద్, చెన్నైలో రూ. 100 నుంచి 130 మధ్యలో ఉంది.