అమెరికాలో అమానవీయం.. కుమారుడిని ఏళ్ల తరబడి భర్తలా వాడుకున్న తల్లి!
- 8 ఏళ్ల క్రితం 17 ఏళ్ల వయసులో రూడీ అదృశ్యం
- అతడిని తన సెక్స్ బానిసగా వాడుకుందని ఆరోపణలు
- నిజం లేదంటున్న పోలీసులు
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం టీనేజర్‌గా ఉన్నప్పుడు అదృశ్యమై వారం రోజుల క్రితం ఓ చర్చ్ బయట కనిపించిన వ్యక్తికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ఇన్ని రోజులూ తల్లితోనే ఉన్నాడని, ఆమె అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని ఓ హక్కుల కార్యకర్త సంచలన ఆరోపణలు చేశారు. బాధితుడి పేరు రూడీ ఫరియస్ అని స్థానిక హక్కుల కార్యకర్తను ఉటంకిస్తూ ‘ఫాక్స్ న్యూస్’ తెలిపింది. రూడీ తల్లి జేనీ శాంటన అతడికి అబద్ధం చెప్పి దాదాపు దశాబ్దంపాటు దాచిపెట్టి వేధింపులకు పాల్పడినట్టు కార్యకర్త క్వానెల్ ఎక్స్ పేర్కొన్నారు.
కుమారుడిని బంధించిన తల్లి.. తండ్రి పాత్ర పోషించాలని.. అంటే తనకు భర్తలా వ్యవహరించాలని కోరిందని క్వానెల్ తెలిపారు. ఈ విషయం బయటపెడితే చిక్కుల్లో పడతావని అతడిని హెచ్చరించింది. హోస్టన్ పోలీస్ విభాగం అధికారులు రూడీ ఫరియస్, అతడి తల్లి జేనీ శాంటనలను కార్యకర్త సమక్షంలో ఓ హోటల్‌లో ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
17 ఏళ్లు ఉన్నప్పుడు 2015లో ఫరియస్ రెండు పెంపుడు శునకాలతో వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కుక్కలు కనిపించినా అతడి జాడమాత్రం లేకుండా పోయింది. కుమారుడిని బంధించిన తల్లి అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని క్వానెల్ తెలిపారు.
పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. కుమారుడిపై తల్లి వేధింపులకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, వీటి ఆధారంగా విచారించబోమని దర్యాప్తు అధికారులు జిల్లా అటార్నీకి తెలిపారు. అయితే, కార్యకర్త మాత్రం ఆరోపణలు నిజమేనని వాదిస్తున్నారు.