నేను ఎన్సీపీ అధ్యక్షుడిని... వయస్సు ఎంతనేది ముఖ్యం కాదు: శరద్ పవార్
- నా వయస్సు 82 లేదా 92 ఉందా? అనేది విషయం కాదన్నా శరద్
- పార్టీని పునర్నిర్మిస్తానని వ్యాఖ్య
- పార్టీ గుర్తు కోసం, పేరు కోసం ఈసీని ఆశ్రయిస్తామని వెల్లడి
- పార్టీపై తిరుగుబాటు చేసినవారు మూల్యం చెల్లించుకుంటారన్న పవార్
నేను ఎన్సీపీ అధ్యక్షుడిని.. నా వయస్సు 82 ఉందా? 92 ఉందా? అనేది విషయంకాదు.. పార్టీని పునర్నిర్మిస్తానని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అజిత్ పవార్ ఏం కావాలనుకుంటున్నారో అది కానివ్వండి, అలా అయితే తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.
పార్టీ గుర్తు కోసం, పేరు కోసం తాము ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తామన్నారు. తాము ఏం చెప్పదలుచుకున్నామో... అన్నీ ఎన్నికల కమిషన్ ముందు చెబుతామన్నారు. పార్టీపై తిరుగుబాటు చేసినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రఫుల్ పటేల్, సునిల్ టట్కారే, ఎస్ఆర్ కోహ్లీ, తదితరులను పార్టీ నుండి బహిష్కరించినట్లు ప్రకటించారు.