శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయం... టీటీడీ ఉద్యోగిని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

  • తిరుమలలో అక్రమ టికెట్ల దందా
  • ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముకుంటున్న ఉద్యోగి 
  • హైదరాబాద్ భక్తులకు రూ.36 వేలకు విక్రయం
తిరుమలలో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విచారణ జరిపారు. ఓ టీటీడీ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉద్యోగి హైదరాబాద్ భక్తులకు శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లను రూ.36 వేలకు విక్రయించినట్టు వెల్లడైంది. బ్రేక్ దర్శన టికెట్ల విక్రయాలపై అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులను విచారించారు. సదరు టీటీడీ ఉద్యోగి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపనున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.


More Telugu News