ఫస్ట్ లవ్ మధుర జ్ఞాపకాలను మళ్లీ మదిలో మెదిల్చే 'ఓ సాథియా'.. రేపే విడుదల
- ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా తెరకెక్కిన ఢిఫరెంట్ లవ్ స్టోరీ 'ఓ సాథియా'
- ఇప్పటికే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న ప్రమోషనల్ కంటెంట్
- తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా రూపొందిన చిత్రం
ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం 'ఓ సాథియా'. ఈ చిత్రాన్ని కొత్త దర్శకురాలు దివ్య భావన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆమె ఆవిష్కరించారు. తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా ఆసక్తికర సన్నివేశాలతో చిత్రాన్ని రూపొందించారు. చందన కట్టా, సుభాష్ కట్టా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. రేపు (జులై 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి తొలి ప్రేమ అనుభవం అనేది ఉండే ఉంటుంది. ఆ రోజుల్లోని మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు, ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ప్రేమ గుర్తులు అనేవి మరపురాని మధుర స్మృతులు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఈ సినిమాను దివ్య భావన తెరకెక్కించారు. ప్రేమ కథల్లో ఇది ఎంతో వైవిధ్యం చూపించే స్టోరీ కావడంతో చిత్ర సక్సెస్ పట్ల పూర్తి నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
ఇప్పటికే 'ఓ సాథియా' మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ప్రతి ప్రేమికుడిలో కూడా ఈ సినిమాతో కొత్త అనుభూతి కలుగుతుందని ప్రూవ్ చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. కుటుంబ సమేతంగా హాయిగా రిలాక్స్ అవుతూ ఆ నాటి తొలి ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి 'ఓ సాథియా' థియేటర్స్ లోకి వెళ్లాల్సిందే అని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రముఖ నటుడు అలీ ఇంటరాక్ట్ కావడం, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడం లాంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్ ఇండియా స్థాయిలో 'ఓ సాథియా' మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన యూఎఫ్ఓ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది.