బండి సంజయ్ తొలగింపుతో ఖమ్మం జిల్లా నేత ఆత్మహత్యాయత్నం

  • ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాస్
  • తమకు సమాచారం లేదన్న పోలీసులు
  • పార్టీ వర్గాలను ఉటంకిస్తూ ‘పీటీఐ’ వార్త
బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపానికి గురైన ఖమ్మం జిల్లా బీజేపీ నేత ఆత్మహత్యకు యత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వార్త విని ఖమ్మం టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, ప్రాణాపాయం లేదని సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలు నిర్ధారించినట్టు ‘పీటీఐ’ పేర్కొంది. కాగా, బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ పెద్దలు ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించారు. బండికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పదవి కేటాయించలేదు.


More Telugu News