గంజాయిని తినేసి స్మగ్లర్లను రక్షించిన ఎలుకలు!

  • చెన్నై మెరీనా బీచ్‌లో గంజాయి రవాణా చేస్తూ చిక్కిన నిందితులు
  • 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని భద్రపరిచిన వైనం
  • మొత్తం గంజాయిని ఎలుకలు తినేశాయన్న పోలీసులు
  • సాక్ష్యం లేకపోవడంతో నిందితులను విడిచిపెట్టిన కోర్టు
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని తినేసిన ఎలుకలు వారు జైలు పాలు కాకుండా రక్షించాయి. తమిళనాడులో జరిగిందీ విచిత్ర ఘటన. రాజ్‌గోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు నిందితులు గతేడాది చెన్నై మెరీనా బీచ్‌లో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు.

అనంతరం నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపించాలని కోర్టు ఆదేశించింది. అయితే, భద్రపరిచిన గంజాయిని ఎలుకలు పూర్తిగా తినేశాయని, కాబట్టి కోర్టులో చూపించలేమని పోలీసులు పేర్కొన్నారు. దీంతో  సాక్ష్యాలు లేని కారణంగా నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది.


More Telugu News