అప్రమత్తంగా ఉండండి: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన నేపథ్యంలో కేటీఆర్

  • వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమన్వయంతో పని చేయాలని సూచన
  • పారిశుద్ధ్య కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి
  • కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన
ఈ వారాంతం నుండి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సమన్వయంతో పని చేయాలన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్క‌డిక‌క్క‌డ‌ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూనే, నగర పారిశుద్ధ్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయాలన్నారు.


More Telugu News