అడవి ఏనుగులతో సెల్ఫీ కోసం ట్రై చేస్తే జరిగింది ఇదీ.. వైరల్ వీడియో
- ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- దుధ్వా నేషనల్ పార్కులో రోడ్డు దాటుతున్న ఏనుగుల మందతో సెల్ఫీకి ముగ్గురి ప్రయత్నం
- తిక్కరేగడంతో వెంటపడ్డ ఏనుగులు
- భయంతో పరుగులు తీసిన వ్యక్తులు, నెట్టింట వీడియో వైరల్
అడవి ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగులు వారి వెంట పడటంతో వారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దుధ్వా నేషనల్ పార్కులో ఈ ఘటన వెలుగు చూసింది. ఏనుగుల మంద రోడ్డు దాటుతుండగా వారు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అవి తిరగబడటంతో వారు పరుగు లంగించుకున్నారు. వేగంగా పరిగెత్తే ప్రయత్నంలో ఓ వ్యక్తి తూలి కిందపడిపోయాడు. మళ్లీ లేచి బతుకుజీవుడా అంటూ కాల్బలం చూపించాడు.
జాతీయ వనాల్లో పర్యటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తరచూ చెబుతూనే ఉంటారు. అడవి జంతువులను సమీపించే ప్రయత్నం చేస్తే అవి దాడి చేస్తాయని హెచ్చరిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అనవసర సాహసాలకు పోయి ఊహించని ప్రమాదాలు కొని తెచ్చుకున్న ఘటనలు సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి.